Mahesh Babu : ఈ శుక్రవారం వస్తోన్న సినిమాలేంటీ..?

చాలా రోజుల తర్వాత ఈ శుక్రవారం తక్కువ సినిమాలే సందడి చేయబోతున్నాయి. కొన్నాళ్లుగా చిన్నా చితకా సినిమాలు, చాలాకాలం క్రితమే షూటింగ్ పూర్తయి ఏదో టైమ్ దొరికింది కదా వచ్చే మూవీస్ కొన్ని ఉంటున్నాయి. బట్ ఈ శుక్రవారం మే 30న స్ట్రెయిట్ గా రెండు సినిమాలు మాత్రమే విడుదలవుతున్నాయి. ఒకటి రీ రిలీజ్. వీటిలో భైరవం సినిమాపై మంచి బజ్ ఉంది. అంచనాలూ కనిపిస్తున్నాయి. తమిళ్ మూవీ గరుడన్ కు రీమేక్ గా రూపొందిన భైరవంను తెలుగులో విజయ్ కనకమేడల తెరకెక్కించాడు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా ఆనంది, అదితి శంకర్, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ట్రైలర్ తర్వాత కలర్ మొత్తం మారిపోయింది. బిజినెస్ లోనూ ఊపు కనిపించింది. కంటెంట్ బలంగా కనిపిస్తోంది. యాక్షన్ లవర్స్ కు ఫీస్ట్ లా ఉండేలా ఉంది. అదే టైమ్ లో స్నేహం, మోసం, వంచన వంటి నేపథ్యాలు కూడా సినిమాలో ఉంటాయి. దీనికి తోడు ముగ్గురు హీరోయిన్లూ అదిరిపోయే ప్రమోషన్స్ తో ఊదరగొడుతున్నారు. ఓ మంచి కమర్షియల్ సినిమా ఇవ్వబోతున్నాం అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు వీళ్లు.
ఇక లెజెండ్స్ కాంబో అని చెబుతోన్న మూవీ ‘షష్టిపూర్తి’. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధానంగా రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రూపేషే నిర్మించాడు. పవన్ ప్రభ దర్శకత్వం చేశాడు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ఓ మెలోడీ సాంగ్ ను కీరవాణి రాయడం విశేషం. లేడీస్ టైలర్ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటిస్తోన్న మూవీ కావడంతో ఆ తరం ఆడియన్స్ లోనూ ఓ క్రేజ్ ఉంది. కానీ దాన్ని క్యాష్ చేసుకునేలా ప్రమోషన్స్ కనిపించలేదు అని చెప్పాలి. ట్రెండ్ కు తగ్గ ప్రమోషన్స్ లో షష్టిపూర్తి వెనకబడింది. ఈ తరానికి చెప్పాల్సిన కథ అని వాళ్లు అంటున్నా.. ఈ తరాన్ని థియేటర్స్ రప్పించేంత ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ లేవు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇక కొన్నాళ్లుగా రీ రిలీజ్ లన్నీ తేలిపోతున్నాయి. అయినా స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగడం లేదు. లాభాల మాట ఎలా ఉన్నా.. అసలు పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందో లేదో కానీ.. గత వారం విడుదలైన యమదొంగను పట్టించుకున్న వాళ్లే లేరు. ఇక ఈ నెల 30న మహేష్ బాబు ఖలేజా చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. అతడు తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. మే 31న సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని చెబుతున్నారు. ఖలేజా థియేటర్స్ లో పోయింది. తర్వాత కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. అనుష్క గ్లామర్ సినిమాకు అదనపు బలం. అందుకే ఈ రీ రిలీజ్ మ్యాజిక్ చేయొచ్చేమో కానీ.. మొత్తంగా ఈ నెల 30న ఈ మూడు సినిమాలే విడుదలవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com