Bheemla Back On Duty: పవన్ ఫ్యాన్స్‌కు తమన్ గిఫ్ట్.. తమకు నచ్చిన పాటను..

Bheemla Back On Duty: ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఎస్ ఎస్ తమన్. ఏ స్టార్ హీరో సినిమా ప్రారంభం అవుతుంది అన్నా దానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫస్ట్ ఛాయిస్ తమనే. ప్రస్తుతం అందరు స్టార్ హీరోలకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చే పనుల్లో పడ్డాడు తమన్. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌కు తమన్ అందించిన సంగీతం ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన జోష్‌ను నింపింది. అందుకే వారికోసం మరో స్పెషల్ గిఫ్ట్‌ను సిద్ధం చేశాడు తమన్.
తమన్ పట్ల ఒకప్పుడు ప్రేక్షకుల్లో చాలా నెగిటివిటీ ఉండేది. ఇప్పుడు వారందరినీ తన సంగీతంతో అభిమానులుగా మార్చుకున్నాడు తమన్. ఇటీవల 'అఖండ'లో తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఇంకా బాలయ్య ఫ్యాన్స్‌కు హ్యాంగ్‌ఓవర్‌గానే ఉంది. అదే సమయంలో అంతకు రెట్టింపు ఎనర్జీతో భీమ్లా నాయక్ మ్యూజిక్ వచ్చింది. ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు పవన్ ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు.
భీమ్లా నాయక్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు జానపద పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఎండ్ క్రెడిట్స్ సమయంలో 'ఎవడ్రా మనల్ని ఆపేది' అనే పాట కూడా అందరినీ మెప్పించింది. అయితే ఈ పాటను సెపరేట్‌గా విడుదల చేయమని పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుండో రిక్వెస్ట్ చేస్తుండగా తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో విడుదలయ్యింది. దీంతో పవన్ అభిమానులు తమన్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com