Sagar K Chandra: ఎవరీ సాగర్ చంద్ర? దర్శకుడిగా పవన్ తనకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారు..?

Sagar K Chandra: టాలీవుడ్‌లో భీమ్లా నాయక్ మ్యానియా మొదలయ్యింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే భీమ్లా నాయక్‌కు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. పవన్ ఫ్యాన్స్ అంతా సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ చాలా గుర్తింపు లభించింది. అందులో ఒకరు దర్శకుడు సాగర్ చంద్ర.
టాలీవుడ్‌లో ఎంతోమంది యంగ్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ అందులో కొందరికి మాత్రమే సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అలా సాగర్ చంద్రకు కూడా లభించింది. సాగర్‌కు డైరెక్టర్‌గా ఉన్న అనుభవం రెండు సినిమాలే అయినా కూడా 'అయ్యపనుమ్ కోషియుమ్' లాంటి బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీని తెలుగులో రీమేక్ చేసే అవకాశం తన చేతికి వచ్చింది.
'భీమ్లా నాయక్' సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసినప్పటి నుండి చాలామంది దీనికి దర్శకుడు త్రివిక్రమ్ అనే అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు త్రివిక్రమ్ కేవలం రైటర్ అని తెలిసింది. అప్పటినుండి భీమ్లా నాయక్ డైరెక్టర్ ఎవరూ అని ఆరాతీయగా సాగర్ చంద్ర అని తెలిసింది. అప్పటినుండి సాగర్ చంద్రపై తెలుగు ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది.
సాగర్ చంద్ర మొదటి చిత్రం 2012లో విడుదలయిన 'అయ్యారే'. మామూలుగా స్వామిజీల పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడేవారి గురించి చాలానే సినిమాలు వచ్చాయి. అందులో అయ్యారే మొదటి స్థానంలో ఉంది. తన రెండో సినిమాను నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా 'అప్పట్లో ఒకడుండేవాడు' పేరుతో తెరకెక్కించారు. ఇదొక పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంది.
మామూలుగా టాలెంట్ ఎక్కడ ఉన్నా వారికి అవకాశం ఇచ్చే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరూ.. సాగర్ చంద్రనే భీమ్లా నాయక్ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అలా తన ముందు సినిమాలు సాగర్‌కు ఈ అవకాశం రావడంలో ముఖ్య పాత్ర పోషించాయి. సినిమా చూసిన వారు యంగ్ డైరెక్టర్ అయినా ఇద్దరు స్టార్ హీరోలను బాగా హ్యాండిల్ చేశాడని ప్రశంసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com