Bheemla Nayak pre release event : భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..!

Bheemla Nayak pre release event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ .. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు 21 ఫిబ్రవరి 2022న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని అనుకున్నారు మేకర్స్.. కానీ ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాదం సమయంలో ఫంక్షన్ చేయడం సరికాదని, ఆయన గౌరవార్ధం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ మూవీ ట్రైలర్‌ని ఈరోజు (సోమవారం) రాత్రి 8: 10 గంటలకి రిలీజ్ చేయనున్నారు.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won't be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com