Bheemla Nayak pre release event : ఇవాళ భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ఆ పాసులు చెల్లవు.. !

Bheemla Nayak pre release event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్ లో భాగంగా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇవాళ (బుధవారం) హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్‌లో జరగనుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా రానున్నారు.
ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జారీ చేసిన పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతిస్తామని చెప్పారు. అయితే ఫిబ్రవరి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు మాత్రం చెల్లవు. ఫిబ్రవరి 23తో ఇచ్చిన కొత్త పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. దయచేసి పాసులు లేని వారు రావొద్దుని సూచించారు.
పాసులు లేకుండా వచ్చి గొడవ పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి11 గంటల మధ్య యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని వెల్లడించారు.
ఈవెంట్ కి వచ్చిన వారు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయాలని, రోడ్డు పైన పార్క్ చేస్తే సీజ్ చేయటంతో పాటు, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com