Bheemla Nayak Release Date: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన 'భీమ్లా నాయక్' నిర్మాత..

Bheemla Nayak Release Date: మామూలుగా స్టార్ హీరోల సినిమాలు అంటే నెలరోజుల ముందు నుండే హడావిడి మొదలయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్, రానా నటించిన 'భీమ్లా నాయక్' మాత్రం ఇంకా ప్రమోషన్స్ కూడా ప్రారంభించకపోవడంతో విడుదల తేదీపై అందరిలో సందేహం కూడా మొదలయ్యింది. ఆ కన్ఫ్యూజన్‌పై ఓ క్లారిటీ ఇచ్చాడు ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
భీమ్లా నాయక్ ముందుగా సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధమయ్యింది. కానీ అప్పటికే పాన్ ఇండియా సినిమాలన్నీ సంక్రాంతి డేట్లను బుక్ చేసుకోవడంతో తప్పని పరిస్థితుల్లో భీమ్లా నాయక్ వెనక్కి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అప్పటి పరిస్థితుల వల్ల భీమ్లా నాయక్ మాత్రమే కాదు ఇంకా ఏ పెద్ద బడ్జెట్ సినిమా విడుదల కాలేకపోయింది. సంక్రాంతి విడుదల వాయిదా పడినప్పుడే భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న వచ్చేస్తుందని ప్రకటించారు మేకర్స్.
ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల అని ప్రకటించి చాలాకాలమే అయ్యింది.. అప్పటినుండి మూవీ యూనిట్ నుండి పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. పైగా విడుదలకు ఇంకా పదిరోజులే ఉన్నా.. ఇంకా ప్రమోషన్స్ కూడా ఏమీ మొదలుపెట్టలేదు. అందుకే ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది. అయితే ఈ సందేహాలు అన్నింటికి చెక్ పెడుతూ నిర్మాత ఓ ట్వీట్ చేశాడు. అందులో భీమ్లా నాయక్ రిలీజ్ ఫిబ్రవరి 25 అని స్పష్టంగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com