Bheemla Nayak: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్..

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కథానాయకులుగా నటిస్తున్న చిత్రం భీమ్లానాయక్.. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాల్సి ఉంది. అయితే సంక్రాంతి పోటీలో ట్రిపుల్ ఆర్ జనవరి 7 , భీమ్లా నాయక్ జనవరి 12, రాధే శ్యామ్ జనవరి 14 , బంగార్రాజు జనవరి 15 న రిలీజ్‌కు సిద్ధంగా వున్నాయి. దాంతో ఈ పోటీ నుంచి భీ మ్లా నాయక్ తప్పుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
నిన్నటి వరకు తగ్గేదెలా జనవరి12 నే వస్తున్నాము అంటు చెప్పిన నిర్మాత నాగ వంశీ పవన్ అభిమానులకు షాకిచ్చారు. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పోస్టర్స్‌కు, టీజర్‌కు, పాటలకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భీమ్లా నాయక్ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, తమన్ సంగీత దర్శకత్వం వహించారు.
మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా తెరె కెక్కిన భీమ్లా నాయక్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com