Bheemla Nayak: 'భీమ్లా నాయక్' రన్ టైమ్ ఎంతంటే..? ఒరిజినల్ కంటే తక్కువగా..
Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.

Bheemla Nayak (tv5news.in)
Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కోసం అటు పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇటు రానా ఫ్యాన్స్ కూడా చాలానే ఎదురుచూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ అందిస్తున్న మాటలు హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. అయితే తాజాగా భీమ్లా నాయక్ రన్ టైమ్ డిసైడ్ అయ్యింది.
రివెంజ్ డ్రామాగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ కొట్టిన మలయాళం సినిమా 'అయ్యపనుమ్ కోషియుమ్'కు ఈ సినిమా రీమేక్. అయితే పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయ్యపనుమ్ కోషియుమ్ సినిమా రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాలు కాగా దానిని ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే భీమ్లా నాయక్ మాత్రం ఒరిజినల్ వర్షన్ కంటే కాస్త తక్కువ రన్ టైమ్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా దగ్గరయ్యేలా మార్పులు చేర్పులు చేశారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అది దృష్టిలో పెట్టుకునే రన్ టైమ్‌ను కూడా తగ్గించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి భీమ్లా నాయక్ రన్ టైమ్‌ను 2 గంటల 27 నిమిషాలుగా డిసైడ్ చేశారు మేకర్స్. ఒరిజినల్‌లో ఉన్న కొన్ని సీన్లను ట్రిమ్ చేయడంతో రన్ టైమ్ తగ్గినట్టుగా సమాచారం.
RELATED STORIES
Lokesh : అది ఒరిజినల్ కాకపోవచ్చంటే ఒరిజినల్ ఉందనేగా : లోకేష్
10 Aug 2022 4:30 PM GMTGorantla Nude Video : అది ఒరిజినల్ వీడియో కాదు.. ఎక్కడి నుంచి అప్లోడ్...
10 Aug 2022 1:54 PM GMTGuntur : పల్నాడులో వెయ్యి మీటర్ల జాతీయ జెండా..
10 Aug 2022 11:45 AM GMTVijayawada: విజయవాడ దుర్గ గుడిలో తెరలేచిన అడ్డగోలు దోపిడీ..
10 Aug 2022 6:49 AM GMTEluru: ఎస్ఈబీ అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..
10 Aug 2022 6:23 AM GMTChandrababu: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన...
10 Aug 2022 3:20 AM GMT