Bheemla Nayak Trailer : గెట్ రెడీ... భీమ్లానాయక్ ట్రైలర్ ఈ రోజే

Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ .. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ని ఈరోజు (సోమవారం) రాత్రి 8: 10 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
పవన్ తుఫాన్‌కి రెడీగా ఉండండి అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. 2 నిమిషాల 14 సెకన్లు ఈ ట్రైలర్ ఉండనుంది. భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు 21 ఫిబ్రవరి 2022న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. నిత్యామీనన్ మరియు సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. మలయాళ ఫిలిం అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకి ఇది రిమేక్.
#BheemlaNayakTrailer
— BA Raju's Team (@baraju_SuperHit) February 21, 2022
2 Mins 14 seconds of POWERFUL RAGE🔥🤙#BheemlaNayakTrailerOnTheWay 💥 pic.twitter.com/Mw9ySxVoZY
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com