భీమ్లా నాయక్ ఇన్ బ్రేక్ టైమ్.. గన్నుతో పవర్ స్టార్ విధ్వంసం..వీడియో

Bheemlanayak: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవన్- రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మూవీ 'భీమ్లానాయక్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. చిత్రీకరణ సమయంలో చిన్న విరామం దొరకడంతో పవన్ గన్ చేతపట్టారు. టార్గెట్‌ని ఎయిమ్ చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసింది. 'భీమ్లా నాయక్ ఇన్ బ్రేక్ టైమ్' అని పేర్కొంది.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అయ్యప్పనుమ్ కోషియమ్' లో బీజుమేనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రల్లో పవన్ -రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఐశ్వర్యా రాజేశ్, నిత్యామేనన్ కథానాయికలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, తమన్ స్వరాలు అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com