Bhola Shankar Pre-Release Celebrations : ఘనంగా 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుక

Bhola Shankar Pre-Release Celebrations : ఘనంగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుక
'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు

ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య' సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాస్, మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు 'భోళాశంకర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకేర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా మూవీలోని నటీనటులు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.

ఈ క్రమంలోనే భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఏకే ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చిరంజీవి, కీర్తి సురేశ్, మెహర్ రమేష్, అల్లు అరవింద్, అనిల్ సుంకర, సుశాంత్ తదితరులు ఉన్నారు. దాంతో పాటు ఆగస్టు 11న థియేటర్లలో వీరిని కలుసుకోండి అంటూ క్యాప్షన్ లో రాసుకువచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేశ్, తమన్నా, సుశాంత్, మెహర్ రమేష్ లను హ్యాష్ ట్యాగ్ లతో ట్యాగ్ చేసింది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి, కీర్తి సురేష్, సుశాంత్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఏఎం రత్నం, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, బుచ్చిబాబు సాన తదితరులు ఈ పాల్గొన్నారు.


'భోళా శంకర్' తమిళ చిత్రం 'వేదాళం' రీమేక్ వెర్షన్ గా రాబోతోంది. యాక్షన్ డ్రామా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషించగా, రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్ పి, పలువురు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. సాగర్ మహతి సంగీతం అందించగా, డడ్లీ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా చేశారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, పాటలకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




Tags

Read MoreRead Less
Next Story