Bhola Shankar: మరో సారి ట్యాక్సీ డ్రెవర్ గా చిరు..

మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరుకి సోదరి పాత్రలో కనిపించనుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 11, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో చిరు పంచ్ డైలాగ్స్, సన్ని వేశాలు, కీర్తి సురేష్ నటన.. ఆధ్యంతం సినీ ప్రియులను అలరించేలా ఉంటుంది. కోలీవుడ్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. కోల్ కత్తాలో అమ్మాయిలు కిడ్నాపుకు గురవుతుంటారు. పోలీసులు చేరుకోలేని ఈ గ్యాంగ్ దగ్గరికి టాక్సీ డ్రైవర్ శంకర్(చిరంజీవి) వెళ్లి కాపాడతాడు. ఇలా సంఘసేవ చేస్తూ చెల్లి(కీర్తి సురేష్)తో సంతోషంగా ఉన్న శంకర్ జీవితంలోకి ఒక శత్రువు(తరుణ్ అరోరా) వస్తాడు. అతని ముఠాని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శంకర్ అసలు ఉద్దేశం ముందు ఎవరికీ అర్థం కాదు. ఇంతకీ ఇతని లక్ష్యం ఏంటి, ఎందుకు ఊచకోతకు తెగబడ్డాడు, సోదరి వెనుక ఉన్న ప్రమాదం లాంటి ప్రశ్నలకు సమాధానం ఆగస్టు 11నే తేలనుంది. ఇక ఈ ట్రైలర్ లోని విజువల్స్ అన్నీ రెగ్యులర్ స్టైల్ లోనే సాగాయి.
దర్శకుడు మెహర్ రమేష్... ఈ సినిమాతో చిరంజీవి ఎనర్జీని పూర్తిగా వాడుకున్నట్టే కనిపిస్తోంది. వేదాళంకు పెద్దగా మార్పులు చేయకపోయినా చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా సబ్జెక్టుని మూవీని సెట్ చేసినట్టు అర్థమవుతోంది. ఈ సినిమాలోని యాక్టర్స్ అందరినీ ఇప్పటికే రివీల్ చేయగా.. నా వెనుక దునియా ఉందని చిరు చెప్పడం, రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా నటిస్తున్నాడని తమన్నా అనడం అంతా మూవీకి స్పెషల్ అట్రాక్షన్ లా నిలవనున్నట్టు తెలుస్తోంది. కంటెంట్ కు తగ్గట్టే మహతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా గట్టిగానే ఉంది. మాస్ ఎంటర్ టైనర్లు రొటీన్ గా ఉన్నా హీరో స్టామినాతో దర్శకుడి తెలివితో గట్టెక్కిపోతుంటాయి. భోళా శంకర్ లోనూ ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇటీవల వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసినట్టు తెలుస్తోంది.
Tags
- Bhola Shankar
- Megastar Chiranjeevi
- Tamannaah
- Keerthi Suresh
- Taxi Driver
- bhola shankar trailer
- bholaa shankar trailer
- bhola shankar movie trailer
- bhola shankar official trailer
- bhola shankar teaser
- bhola shankar
- chiranjeevi bhola shankar
- bhola shankar theatrical trailer
- bhola shankar movie
- chiranjeevi bhola shankar trailer
- bhola shankar songs
- bholaa shankar teaser
- bholaa shankar movie trailer
- bhola shankar official teaser
- bholaa shankar
- chiranjeevi bhola shankar teaser
- bhola shankar trailer review
- tv5news
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com