రామ్ చరణ్ సినిమాలో 'ఇంద్ర' సాంగ్ రీమిక్స్.. ?

రామ్ చరణ్ సినిమాలో ఇంద్ర సాంగ్ రీమిక్స్.. ?
రామ్ చరణ్ తో ఆ సాంగ్ ను రిమేక్ చేయనున్న'భోళా శంకర్' మ్యూజిక్ డైరెక్టర్..!

తన కెరీర్‌లో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన లెజెండరీ 'మెలోడీ బ్రహ్మ' మణిశర్మ ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ముఖ్యంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన ఎన్నో మరపురాని పాటలను స్వరపరిచారు. ప్రస్తుతం, ఆయన కుమారుడు, మహతి స్వర సాగర్, చిరంజీవి రాబోవు చిత్రం 'భోళా శంకర్'లో పని చేసే అద్భుతమైన అవకాశాన్ని పొందారు.

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ను పంచుకున్నారు. అతను తన తండ్రి కంపోజిషన్లలో ఒక సాంగ్ ను రీమిక్స్ చేయాలనే తన హృదయపూర్వక కోరికను వ్యక్తం చేశాడు. అవకాశం ఇస్తే భవిష్యత్ ప్రాజెక్ట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'ఇంద్ర' చిత్రంలో నుంచి ఐకానిక్ 'ట్రాక్ రాధే గోవింద'ను రీమిక్స్ చేయాలని భావిస్తున్నట్టు తన మనసులోని కోరికను వెల్లడించారు.

ఇదిలా ఉండగా 'భోళా శంకర్' నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు విపరీతమైన రెస్పాన్స్ రాగా.. ఈ వారంలో మరో రెండు పాటలను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో భారీగా విడుదల కానుంది.

ఇక 'ఇంద్ర' సినిమా విషయానికొస్తే.. 2002లో రిలీజైన ఈ సినిమా సీమలోని ఫ్యాక్షన్ తగాదాలను గురించి వివరించింది. వైజయంతీ మూవీస్ పతాకంపై వచ్చిన ఈ మూవీని సి. అశ్వనీదత్ నిర్మించాడు. ఈ ఇక ఈ చిత్రంలోని సాంగ్స్ కు కూడా అప్పట్లో భారీ రెస్పాన్సే వచ్చింది. ఇప్పటికీ ఆ పాటలకు, ఆ సినిమాలోని మ్యూజిక్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందులోనూ ముఖ్యంగా 'రాధే గోవిందా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే, అలాంటి సాంగ్ మరోసారి రీమిక్స్ రూపంలో.. అది కూడా రామ్ చరణ్ సినిమాలో వస్తే.. మెగా ఫ్యాన్స్ కు పండగేనని నెటిజన్లు అంటున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీల్లో రిలీజ్ కానుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ సినిమాగా 'గేమ్ ఛేంజర్' రాబోతోంది.



Tags

Read MoreRead Less
Next Story