Bhole Shawali : తల మూవీ కోసం భోలే షావలీ ఎనర్జిటిక్ సాంగ్

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా తల. రీసెంట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. రణం తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్ ను అందుకోబోతున్నాడు అమ్మ రాజశేఖర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. పాట వినగానే ఇమ్మీడియెట్ గా కనెక్ట్ అయిపోయేలా ఉంది. బిగ్ బాస్ ఫేమ్ ఎనర్జిటిక్ సింగర్ భోలే షావలీ పాడిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ రాశాడు. విశేషం ఏంటంటే.. ఈ పాటను తమిళ్ లో మల్టీ టాలెంటెడ్ లెజెండరీ పర్సనాలిటీ టి రాజేందర్ పాడారు. ఇలాంటి హుషారైన గీతాలకు టి. రాజేందర్ పెట్టింది పేరు. అందుకే ఈ పాట తమిళ్ లోనూ ఊపేస్తోంది.
ప్రధానంగా ఈ పాటను కమెడియన్ ముక్కు అవినాష్ పై చిత్రీకరించారు. ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, కష్టాలు ఎలా ఉంటాయో అతను వివరిస్తున్నట్టుగా ఉంది సాహిత్యం. రణం చిత్రంలో అలీపై చిత్రీకరించిన ‘నమ్మొద్దు నమ్మొద్దూ ఆడవాళ్లను నమ్మొద్దూ’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించిన హిట్ అయ్యే పాటలా ఉంది.
‘చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పడుతుందయా.. దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా.. కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కిపోతుందయా’ అంటూ మొదలైన ఈ పాటలో ఈ తరం యూత్ కు బాగా నచ్చేలా ఉంది సాహిత్యం. ప్రేమలో పడితే అమ్మాయిలు పెట్టించే ఖర్చులు, వారు పెట్టే ఇబ్బందులు తెలుపుతూ ఆఖర్లో ప్రేమ గురించి అడిగితే ‘హూ ఆర్ యూ’ అందిరా అంటూ వచ్చే ఫినిషింగ్ టచ్ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రాన్ని ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com