Bhumika Chawla: 21 ఏళ్ల తర్వాత.. భూమిక మరోసారి అలా..

Bhumika Chawla (tv5news.in)
Bhumika Chawla: భూమిక.. పదేళ్ల క్రితం ఈ హీరోయిన్ అంటే చాలామందికి క్రష్. దాదాపు టాలీవుడ్‌లోని అప్పటి స్టార్ హీరోలు అందరితో జతకట్టింది భూమిక. అంతే కాదు.. అందులో చాలావరకు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. పవన్ కళ్యాణ్‌తో చేసిన 'ఖుషి' సినిమా అయితే అప్పట్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అందులో భూమిక చేసిన మధు పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అయితే ఖుషి వచ్చిన 21 ఏళ్ల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేసింది భూమిక.
దాదాపు నాలుగేళ్ల వరకు టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరీ సినిమా అవకాశాలు దక్కించుకుంది భూమిక. కానీ కొంతకాలం తర్వాత తాను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో తనకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఇక కొంతకాలానికి అక్క పాత్రలతో టాలీవుడ్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది భూమిక.
తాను హీరోయిన్‌గా ఫేడవుట్ అయిపోయి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ భూమిక గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే తన ఫ్యాన్స్ కోసం, ఖుషి సినిమా ఫ్యాన్స్ కోసం అందులోని 'అమ్మాయే సన్నగా' పాటకు స్టెప్పులేసింది భూమిక. తన డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రాధాకృష్ణన్‌తో కలిసి భూమిక వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన డ్యాన్స్‌ను చూసి ప్రేక్షకులందరూ మరోసారి ఖుషి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com