Thammudu Nithiin : నితిన్ తమ్ముడు నుంచి భూ అంటూ భూతం సాంగ్ రిలీజ్

నితిన్ హీరోగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక ఫీమేల్ లీడ్స్ లో నటించిన సినిమా ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ తమ్ముడికి అక్కగా నిన్నటి తరం హీరోయిన్ లయ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఆ మధ్య విడుదలైన తమ్ముడు బ్యాంగర్ కు మంచి స్పందన వచ్చింది. నితిన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా అని దిల్ రాజు చెప్పాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం హైలెట్ గా ఉండబోతోందని ఆ బ్యాంగర్ తోనే తెలిసిపోయింది. ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన కథలా కనిపించింది. తాజాగా ఈ చిత్రం నుంచి భూ అంటూ భూతం అనే సాంగ్ ను విడుదల చేశారు.
అజనీష్ సంగీతంలో సింహాచలం మన్నెం రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆలపించారు. ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి.. ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటాలాడాలి.. పుట్టగానే నేరుగా నువ్వు పరుగెత్తలే.. పట్టుకుంటూ పడుతూ..నడకే నేర్చావే.. భయపడి అడుగు ఆపకే..’ అంటూ సాగే ఈ గీతం తన మేనకోడలికి ధైర్యం చెబుతూ హీరో పాడే పాటలాగా కనిపిస్తోంది. పాటలో లయతో పాటు వర్ష బొల్లమ్మ కనిపిస్తోంది. ఒక అడవిలో వీరు తప్పిపోయిన సందర్భంలో పాప భయపడుతుంటే ధైర్యం కోసం హీరో పాడినట్టుగా ఉంది.
సింపుల్ ఆర్కెస్ట్రైజేషన్ తో వినగానే ఆకట్టుకునేలా ఉందీ గీతం. సందర్భానికి ఎలివేట్ చేస్తూ మంచి సాహిత్యం కనిపిస్తోంది. తను పాడితే ఆ పాట హిట్టే అన్న ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అనురాగ్ కులకర్ణి. ఈ పాట అది నిజమే అని చెప్పేందుకు మరో ఎగ్జాంపుల్ లా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com