Pratinidhi 2 : రిలీజ్ కు సిద్ధమైన నారా రోహిత్ కొత్త సినిమా

Pratinidhi 2 : రిలీజ్ కు సిద్ధమైన నారా రోహిత్ కొత్త సినిమా
ఈ నెల 25న విడుదల కానున్న నారా రోహిత్ కొత్త సినిమా ప్రతినిధి 2

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో నారా రోహిత్ ఒకరు. అయినప్పటికీ ఆయన ఇప్పటివరకూ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత కలెక్షన్లను రాబట్టలేకపోయాయి, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీనికి గల కారణాలేవైనా.. స్క్రిప్ట్‌ల ఎంపిక సరిగా లేదని, అందువల్లే ఆయన సినిమాలు ఇలా ఫ్లాప్ అవుతున్నాయని కొందరు వాదిస్తున్నారు.

నారా రోహిత్ చేసిన సినిమాల్లో కొన్ని మంచి విజయాన్నీ రాబట్టిన చిత్రాలూ లేకపోలేదు. అందులో ప్రతినిధి ఒకటి. 2014లో ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో దర్శక, నిర్మాతలు ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. అంతేకాదు ప్రతినిధి 2 అనే పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ ను కూడా ఇప్పటికే ప్రకటించారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ చిత్రంతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొంటున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ ఈ నెల 25న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ కూడా అంతగా లేదు. కావున ప్రతినిధి 2కి పెద్ద మొత్తంలో గనక ప్రచారం చేస్తే విజయం ఖాయమవుతుందని పలువురు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో టిల్లు స్క్వేర్, మలయాళ డబ్బింగ్ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ తప్ప, మరే ఇతర చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించలేకపోయింది. దీంతో థియేటర్లలో కొత్త సినిమాల ప్రవేశానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది.

మరోవైపు దిల్ రాజు సమర్పణలో లవ్ మి ఇఫ్ యు డేర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని 25న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందుకే చాలా థియేటర్లు బ్లాక్ అయ్యాయి. ప్రతినిధి 2 ఎప్పుడో రిలీజ్ కావల్సింది. కానీ అనేక కారణాల వల్ల సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కాలేకపోయింది.

ఇదిలా ఉండగా.. విశాల్ తదుపరి చిత్రం రత్నం కూడా మరో డబ్బింగ్ చిత్రంతో పాటు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ప్రతినిధి 2 ప్రేక్షకులను ఆకర్షించే అంశాలను కలిగి ఉంది. దీంతో కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా హిట్ అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్రస్తుతం రాజకీయాలలో, పాలనలో అవినీతిని ప్రశ్నించే ఒక జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ మూవీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని అభిమానులు, సినీ విశ్లేషకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story