Telugu Big Boss Season 8 : అత్యంత చప్పగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్

Telugu Big Boss Season 8 :  అత్యంత చప్పగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్

తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తోంది. ఎప్పట్లానే అక్కినేని నాగార్జుననే హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ వారమే ప్రారంభమైన సీజన్.. ఆరంభంలోనే పేలవంగా మొదలైంది. ఫస్ట్ డే కంటెస్టెంట్స్ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూసిన ఆడియన్స్.. వచ్చిన వాళ్లను చూసి హ్మ్.. వీళ్లా అని నిట్టూర్చారు. ఒక్కరికి పెద్ద స్టేచర్ లేదు. మాగ్జిమం సీరియల్ బ్యాచ్. ఎవరూ ప్రేక్షకులను కట్టిపడేసే రేంజ్ ఉన్నవాళ్లు కాదు. దీంతో స్టార్టింగ్ లోనే డల్ గా మొదలైంది. నిజానికి సీజర్ ప్రారంభానికి ముందు వినిపించిన పేర్లు చూస్తే ఈ సారి బిగ్ బాస్ ఓ రేంజ్ లో ఉండబోతోందని భావించారు ప్రేక్షకులు. బట్ వీళ్లు అందుకు భిన్నంగా టీమ్ ను ఎంపిక చేశారు.

ఇక ఈ వారంలో వీళ్లను చూస్తే గత ఎపిసోడ్స్ లో ఎవరైతే ఎక్కువగా అరుస్తూ.. అనవసరమైన గొడవలు చేశారో వాళ్లనే ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఊరికే అరవడాలు, ఫ్రస్ట్రేట్ కావడం.. డామినేషన్ కోసం ప్రయత్నించడం.. అన్నట్టు.. సింపతీల పంచాయితీలతో కలిపి మొత్తంగా ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదు. దీనికి తోడు కంటెస్టెంట్స్ పెద్ద మైనస్ గా మారారు. అంటే ఒకరు హై, మరొకరు లో, మరికొందరు మీడియం.. సమన్వయం చేసేవారు.. సమరానికి సై అనేవాళ్లూ అంటూ కొన్ని కొలతల్లో కనిపిస్తుందనుకుంటే అంతా ఒకే తాటిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

ఇప్పటి వరకూ వచ్చిన ఎపిసోడ్స్ చూస్తే వాళ్లెవరో తెలియకపోయినా.. ఫస్ట్ వీక్ కే అభిమానులుగా మారిపోయిన వాళ్లు ఉన్నారు. బట్ ఈ సారి అలాంటి కంటెస్టెంట్ ఒక్కరు కూడా కనిపించడం లేదు. దీంతో ఈ రియాలిటీ షోను చూడాలన్న మూడు, ఉత్సాహమూ మొదటి వారానికే చచ్చిపోయాయ్ అని ఫీలవుతున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. మరి ఈ సీజన్ లో ఉన్న సత్తా ఏంటనేది ఈ వారం వచ్చే రేటింగ్స్ చూస్తే ఈ షో ఎంత చప్పగా సాగుతుందో తెలిసిపోతుంది.

Tags

Next Story