బిగ్ బాస్ ప్రియాంక సింగ్ లవ్ స్టోరీ.. వింటే కన్నీళ్లాగవు

బిగ్ బాస్ ప్రియాంక సింగ్ లవ్ స్టోరీ.. వింటే కన్నీళ్లాగవు
అబ్బాయి, అమ్మాయి మాత్రమే కాదు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్న కథలు కూడా మనం ఈమధ్య చాలానే వింటున్నాం.

అబ్బాయి, అమ్మాయి మాత్రమే కాదు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్న కథలు కూడా మనం ఈమధ్య చాలానే వింటున్నాం. వాటిలో అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన బిగ్ బాస్ హౌస్‌మేట్ పింకీ ప్రేమకథ కూడా ఒకటి. ఒక ట్రాన్స్‌జెండర్‌ సొసైటీలో ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్తూ, తన మొదటి ప్రేమకథను పింకీ బిగ్ బాస్ ప్రేక్షకులతో పంచుకుంది.

తాను అబ్బాయిగా ఉన్నప్పుడే రవి అనే వ్యక్తితో ప్రేమలో పడిందట పింకీ. ఎప్పుడూ తనకు సపోర్ట్ చేస్తూ తన పక్కనే ఉండడంతో రవిపై ఇష్టం పెంచుకుంది. ఇక వారిద్దరూ కలిసి సంతోషంగా ఆరేళ్లు గడిపారు. పింకీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరబడిన తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఆ తర్వాత కొంతకాలం పింకీ రవికి దూరంగా ఉన్నా.. ఫైనల్‌గా ఒకరోజు కలిసి తనకు జరిగిందంతా చెప్పి ప్రేమిస్తున్నానంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది.

దానికి రవి కూడా సానుకూలంగానే స్పందించాడు. పెళ్లి గురించి పింకీ తనను పలుమార్లు ప్రశ్నించినా తాను కూడా ఓకే అన్నట్టుగానే మాట్లాడాడు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటూ రవి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు పింకీ రవిని కలిసి తనను పెళ్లి చేసుకుని తనతోనే ఉండమని ఎంతో వేడుకున్న అతడు పట్టించుకోలేదు. అంతే కాక పింకీని భాదపెట్టే విధంగా తనకు ఇష్టం లేని పదం వాడుతూ దూషించాడు.

అతడి కాళ్ల మీద పడి వేడుకున్న కూడా పింకీకి ఏ మాత్రం విలువనివ్వలేదు. అయినా కూడా తన జీవితంలో మొదటి ప్రేమగా నిలిచిన రవికి ఇప్పటికీ పింకీ మనసులో ప్రత్యేక స్థానం ఉందంటూ తాను చెప్పుకొచ్చింది. తాను ప్రేమగా రవిని అబ్బాయి అని పిలుచుకునేది అంటూ గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story