Sankranti 2022 : టాలీవుడ్ కి అసలైన సంక్రాంతి.. మరి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసేది ఎవరు?

RRR:
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా RRR.. కేవలం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు. ఇండియన్ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్సు చేశారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడం, ఎన్టీఆర్, రామ్‌చరణ్ లు కలిసి నటిస్తుండడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
భీమ్లా నాయక్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. సంక్రాతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
రాదేశ్యామ్ :
వర్షం, యోగి లాంటి సినిమాల తర్వాత మళ్ళీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు పాన్ ఇండియన్ హీరో ప్రభాస్.. ప్రభాస్, పూజ హెగ్డే కలిసి నటిస్తోన్న చిత్రం రాదేశ్యామ్... పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14నవిడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com