Vijay Devarakonda : టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda :  టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ.. నిన్నటి వరకూ ట్రోలర్స్ కు ఈజీ టార్గెట్. తనలో ఎంతో టాలెంట్ ఉన్నా.. కేవలం అతని యాటిట్యూడ్ నచ్చదు అనే కారణంతో అతన్ని హేట్ చేసేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా విజయ్ పై ట్రోల్స్, మీమ్స్ బాగా శృతి మించుతున్నాయి. దీనికి తోడు అతని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయడం లేదు. దీంతో వీళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. అలాంటి వారందరి నోళ్లూ ఒక్క ఫోటో మూయించిందంటే కాస్త ఆశ్చర్యం అనే చెప్పాలి. యస్.. లేటెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి చాలామంది వావ్.. అనేశారు. ఆ స్టిల్ లోని ఇంటెన్సిటీ చూసి ఈ మూవీ హిట్ అయితే విజయ్ రేంజ్ ఎక్కడికో పోతుందని ఇన్నాళ్లూ ట్రోల్ చేసిన వాళ్లు కూడా పబ్లిక్ గా పోస్ట్ లు పెడుతున్నారంటే ఆ స్టిల్ వేసిన ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ విజయ్ కి 12వది. అతనో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడనీ, స్పై గా కనిపిస్తాడు అనే కామెంట్స్ ఉన్నాయి. ఈ రెండిటిలో ఏదైనా అది విజయ్ ఫస్ట్ టైమ్ చేసే పాత్రే అవుతుంది. అతని సరసన బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించబోతోందంటున్నారు. విజయ్ తో పాటు సత్యదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఓ కీలకమైన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.

మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమాను 2025 మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. మరి అంతా అనుకుంటున్నట్టు.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే విజయ్ రేంజ్ కూడా మారిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Tags

Next Story