Vijay Devarakonda : బెట్టింగ్ యాప్స్ లో స్టార్స్ ట్విస్ట్

బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎందరో అమాయకులు ఆ వలలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దీని వెనక ఉన్న ఊబి తెలియకుండా వాటిని ప్రమోట్ చేస్తూ చిన్నపాటి సెలబ్రిటీస్ నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్స్ అందుకుంటున్నారు. ప్రమోషన్స్ చేస్తున్నారు. తమ అభిమాన నటులు ప్రమోట్ చేస్తున్నారు కదా అని అందులోకి దిగిన సామాన్యులు.. మొదట చిన్న మొత్తాల్లో లాభాలు చూసి ఆపై భారీ మొత్తాల్లో నష్టపోతున్నారు. ఇవాళ కాకపోతే రేపు అంటూ స్థాయికి, స్తోమతకు మించిన అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక చివరికి కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రీసెంట్ గా తెలుగు స్టేట్స్ లో కొందరిపై కేస్ లు నమోదు చేశారు. అయితే ఈ కేస్ ల విషయంలో పోలీస్ ల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతా చిన్నవాళ్లే ఉన్నారు. పెద్దవాళ్ల జోలికి వెళ్లరా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పించారు. ఇలాంటి విషయాల్లో కాస్త సీరియస్ గా ఉంటోన్న ప్రభుత్వం ఆ పెద్ద సెలబ్రిటీస్ ను కూడా మూసేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో అనూహ్యంగా ఈ లిస్ట్ లోకి చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చారు. వీరిపైనా కేస్ లు నమోదు అయ్యాయి.
తాజాగా కేస్ లు నమోదు అయిన సెలబ్రిటీస్ లో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీ ముఖి వంటి వారు ఉన్నారు. వీరు కాక సోషల్ మీడియా ఇన్ ఫ్లుయొన్సర్స్ పేరుతో హంగామా చేసే శ్రీ ముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభాశెట్టి, అమృత, పావని, నేహ, పండు, విష్ణు ప్రియ, బయ్యా సన్నీయాదవ్, సుప్రీత, రఘు, టేస్టీ తేజ, రఘు, శ్యామల, ఇమ్రాన్ ఖాన్, పద్మావతి తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవుతున్నారు. మరి విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ వంటి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com