Mehaboob : టిక్‌టాక్ స్టార్‌కు మెహబూబ్ ప్రపోజ్.. ఇంతకీ ఎవరా అమ్మాయి?

Mehaboob : మెహబూబ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫుల్ ఫేమస్ అయిన మెహబూబ్.. గతేడాది బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని మరింతగా పాపులర్ అయ్యాడు.. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక గుంటూరు మిర్చి ఓ సినిమాని చేశాడు.
ఒక పక్కా సినిమాలతో పాటుగా కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. ఇదిలావుండగా యూట్యుబర్, టిక్‌టాక్ స్టార్ శ్వేతనాయుడుకి ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ శ్వేతనాయుడు ఎవరంటే.. మెహబూబ్ తో కలిసి గతకొంతకాలంగా కవర్ సాంగ్స్ చేస్తోంది.అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో శ్వేతకి ప్రపోజ్ చేశాడు మెహబూబ్... 'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అని తన మనసులో మాటను చెప్పేశాడు.
దీనికి శ్వేత సిగ్గుపడుతూ మహబూబ్ ప్రేమని అంగీకరించింది. అయితే ఇది నిజమేనా లేకా ఏమైనా ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com