మోనాల్ ఇచ్చిన గిప్ట్ హాట్‌గా ఉంది: అఖిల్

మోనాల్ ఇచ్చిన గిప్ట్ హాట్‌గా ఉంది: అఖిల్
ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి బిజీగా ఉన్నాడు. ఇంకా అఖిల్‌‌కి ఓ అభిమాని ల్యాప్‌ట్యాప్ బహుకరించింది.

బిగ్‌బాస్ హౌస్‌లో మిగిలిన వారి కంటే కొంచెం భిన్నంగా ఉంటే ప్రేక్షకులు ఆట పట్టిస్తారు. మరి హౌస్‌లో వాళ్లు పులిహోర కలిపిన విధానం కూడా అలాగే ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని గుసగుసలు వినిపిస్తుంటాయి. అదే నిజం చేశాడు. మోనాల్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన తరువాత అఖిల్ కొంత మానసిక సంఘర్షణకు లోనయ్యాడు.

తెరపై దాన్ని ఎక్కువగా చూపించకపోయినా బయటకు వచ్చిన తరువాత కూడా వారిద్దరి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోంది. అందుకేనేమో తనప్రియమైన కో కంటెస్టెంట్‌ అఖిల్‌కి మోనాల్ రంగు రంగుల పూలున్న ఎరుపు షర్ట్ బహుకరించింది. షర్ట్ అందుకున్న అఖిల్.. అది వేసుకుని చాలా హాట్‌గా ఉందని ఇన్‌స్టాలో ఫోటో పోస్ట్ చేశాడు.

ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి బిజీగా ఉన్నాడు. ఇంకా అఖిల్‌‌కి ఓ అభిమాని ల్యాప్‌ట్యాప్ బహుకరించింది. ఆమె తనపై చూపించిన అభిమానానికి అఖిల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాగా మోనల్ బుల్లి తెర షో డ్యాన్స్ ప్లస్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం అల్లుడు అదుర్స్‌లో ఓ పాటలో మెరిసింది.

Tags

Next Story