Bigg Boss 5 Telugu : ఈ వారం ఆర్జే కాజల్ అవుట్ ?

Bigg Boss 5 Telugu : టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న బిగ్‌బాస్ 5 తెలుగు చివరిదశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో షో ముగియనుంది. దీనితో టాప్ -5లో ఎవరు ఉంటారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అంతేకాకుండా షో చివరి వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వారం ఆర్జే కాజల్ ఎలిమినేట్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో కాజల్ కి తక్కువ ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లోకి 17 వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కాజల్.. మొదటి రెండుమూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారంతా కానీ.. తన ఆటతో అందరిని ఆకట్టుకుంటూ వస్తోంది..అయితే ఇప్పుడు ఆమె ఎలిమినేషన్ కి రంగం సిద్దమైనట్టుగా సమాచారం. కాగా ఇప్పటికే సింగర్ శ్రీరామ్ ఫినాలేకి చేరుకున్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com