Bigg Boss: ఆ విషయం గురించి మాట్లాడొద్దు ప్లీజ్..: యాంకర్ రవి రిక్వెస్ట్
Bigg Boss: ఇష్టం లేకపోయినా పర్సనల్ విషయాలు పబ్లిక్‌గా చెప్పాలి బిగ్‌బాస్‌కి.. తమ జీవితాలకు సంబంధించి ప్రేక్షకులకు తెలియని ఓ కొత్త విషయాన్ని కంటెస్టెంట్లు తెలియజేస్తుంటారు. హౌస్‌లోకి అడుగుపెట్టిన యాంకర్ రవిని పెళ్లి గురించి ప్రశ్నించబోయారు నాగార్జున.. కానీ రవి ఆ విషయం గురించి మాట్లాడకండి సార్ అంటూ చిన్నగా రిక్వెస్ట్ చేశారు.
రవికి పెళ్లై తొమ్మిది సంవత్సరాలైందని, ఓ పాప కూడా ఉందని తెలిసి బుల్లితెర ప్రేక్షకులు అవాక్కయ్యారు ఒకానొక సందర్భంలో. ఒకప్పుడు లాస్య, రవి జోడి చాలా ఫేమస్.. ప్రస్తుతం శ్రీముఖి, రవిల జోడీ కొన్ని షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుంటారు.
ఇన్నేళ్లలో ఎన్నడూ పెళ్లి ప్రస్తావన తీసుకురాని రవి సడెన్‌గా ఓ రోజు నేను, నా భార్య, మాకొక పాప అంటూ ఫోటోలు పోస్ట్ చేయడంతో.. యాంకర్ రవికి పెళ్లైందాని అందరూ అనుకున్నారు. ఇప్పడదే విషయాన్ని నాగ్ ప్రస్తావించగా వద్దని వారించాడు.
యాంకర్‌గా క్లిక్ అవడంతో సిల్వర్ స్క్రీన్‌పైన కూడా అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నాడు.. 2017లో ఇది మా ప్రేమకథ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా బెడిసికొట్టడంతో మళ్లీ ప్రయోగాలు చేయదల్చుకోలేదు. బుల్లితెరపైనే జనాన్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
వన్ షో, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, కిరాక్ సహా పలు షోలకు యాంకరింగ్ చేస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి పంతొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి ఎలా ఆడతాడు.. హౌస్‌లో ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com