Bigg Boss 5 Telugu: తెలుగుతెరపై బాలీవుడ్ తారలు.. త్వరలో..

Bigg Boss 5 Telugu: ఈమధ్య సినిమా ప్రమోషన్స్ కోసం నటీనటులు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న సినిమాలను ప్రతీ భాషలో ప్రమోట్ చేయడానికి ఎంత దూరమయినా వెళ్తున్నారు. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా నటీనటులు కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే త్వరలో ఓ బాలీవుడ్ క్యూట్ కపుల్ తెలుగుతెరపై కనపించనుంది.
బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఒకరు. ఈ ఇద్దరు చివరిగా 'పద్మావత్' సినిమాలో సినిమాలో కలిసి నటించారు. అందులోనూ వీరిద్దరు కపుల్‌లాగా కాకుండా దీపికా హీరోయిన్‌గా, రణవీర్ విలన్‌గా కనిపించాడు. అయితే మళ్లీ వీరిద్దరిని హీరోహీరోయిన్‌గా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులకు '83' సమాధానంగా రానుంది.
సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న '83'లో రణవీర్, దీపికా జంటగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా హిందీలోనే కాకుండా దక్షిణ భాషల్లో కూడా విడుదల కానుంది. అందుకే తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ 5 తెలుగు ఫైనల్‌లో ఈ జంట సందడి చేయనుంది అని టాక్ నడుస్తోంది. వీరితో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ కోసం ఆలియా భట్, రామ్ చరణ్ కూడా బిగ్ బాస్ ఫైనల్‌లో అలరించనున్నారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com