Bigg Boss 5 Telugu: 'నాకు నువ్వు అస్సలు నచ్చట్లేదు' పింకీపై మానస్ ఆగ్రహం

Bigg Boss 5 Telugu (tv5news.in)
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో టాప్ 5 ఎవరో తెలుసే రోజు దగ్గర పడుతోంది. ఈ సమయంలో కంటెస్టెంట్స్ ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రతీ ఒక్కటి ప్రేక్షకులు స్పష్టంగా గమనిస్తారు. చివరి నిమిషం వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేదు. ఏ సందర్భంలో అయినా టాప్‌లో ఉన్న హౌస్‌మేట్స్ లాస్ట్ ప్లేస్‌కు రావచ్చు. లీస్ట్‌లో ఉన్న హౌస్‌మేట్ టాప్ పొజిషన్‌కు చేరుకొవచ్చు.
ప్రస్తుతం పలు సర్వేల ప్రకారం చూస్తే సన్నీ, షన్నూ ఇద్దరు టాప్ 5 లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక వీరు కాకుండా ఎవరు టాప్ 5కు వెళ్తారన్న విషయం తేలాల్సి ఉంది. అయితే సీజన్ మొదలయినప్పుడు కొన్నిరోజుల వరకు మానస్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాగా ఆడుతున్నాడన్న మార్క్‌ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.
రోజులు గడుస్తున్నా కొద్దీ.. మానస్‌ను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. దానికి కారణం మరో హౌస్‌మేట్ పింకీ. మానస్ ఎప్పుడు తన గేమ్‌పై దృష్టిపెట్టాలనుకున్నా పింకీ తనకు ఓ డైవర్షన్‌లాగా ఉండేది. కలిసి టాస్క్‌లు ఆడే సందర్భంలో కూడా పింకీ వల్లే తాను ఓడిపోతున్నాడని ప్రేక్షకులకు భావించడం మొదలుపెట్టారు. అందుకే ఇద్దరిపై ఒకేసారి నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది.
పింకీ ప్రవర్తనను గమనించిన మానస్.. తనతో ఉండడం తగ్గించేశాడు. తన మాట వినడం కూడా మానేశాడు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈరోజు (మంగళవారం) జరగనున్న ఎపిసోడ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవనే హైలైట్ చేసి చూపించింది బిగ్ బాస్ టీమ్. ఈ ప్రోమోలో మానస్ పింకీపై గట్టిగట్టిగా అరుస్తూ.. నువ్వంటే ఇష్టం లేదు అన్నాడు. అసలు అంత వాగ్వాదం వీరి మధ్య ఎందుకు జరిగిందో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com