Bigg Boss 5 Telugu Winner Vj Sunny: సన్నీ హవా మామూలుగా లేదుగా.. అమెరికా అమ్మాయి.. రూ.100 కోట్ల కట్నం..!!
Bigg Boss 5 Telugu Winner Vj Sunny: అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎన్ని చూడాలి.. ఆస్తిపాస్తుల విషయాలు పక్కన పెడితే అబ్బాయి మంచోడో కాదో ఎవర్ని అడిగితే చెప్తారు.. దగ్గరగా చూసిన వాళ్లకు తప్ప అలాంటి విషయాలు చెప్పడానికి ఎవరూ ముందుకు రారు.. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలంటారు..
మరి అతడు/ఆమె గురించి నిజం చెబితే పెళ్లి ఆగిపోతుందేమో అని తెలిసినా నోరు మెదపరు కొంతమంది.. మరి అలాంటివి ఏవీ అవసరం లేకుండానే బిగ్‌బాస్ హౌస్‌లో మాకో వరుడు దొరికేసాడు అని ఆనందపడిపోతూ తన కూతుర్ని చేసుకోమని అడిగింది సన్నీని ఓ ఎన్నారై మహిళ. నీలాంటి వాడికి నిలువెత్తు బంగారం ఇచ్చినా తక్కువే..
ఓ వందకోట్లు ఇస్తా.. ఓకేనా అంటూ కాల్.. దానికి సన్నీ కూడా అంతే కూల్‌గా రిప్లై ఇచ్చాడు. ఆంటీ నన్ను భరించాలంటే మీ అమ్మాయికి చాలా ఓర్పు కావాలి.. మీరు ఆ మాట అన్నారు అంతే చాలు.. అని అన్నాడు. దానికి ఆమె జోక్ చేస్తున్నానని అనుకోకు సీరియస్‌గా అడుగుతున్నా అని లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడేస్తుంది. సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్ కాల్ నెట్టింట వైరల్ అవుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com