Bigg Boss 5 Telugu: పెళ్లవక ముందే అమ్మైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో షేర్ చేసిన సిరి హన్మంత్..

హౌస్‌లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి చలాకీగా ఉంటూ అందర్నీ నవ్విస్తూ టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటున్న నటి సిరి హన్మంత్.. హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్‌గా అవతరించి ఆడియన్స్‌తో బాగా కనెక్ట్ అయింది. వైజాగ్‌కి చెందిన సిరి లోకల్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పని చేసింది. పలు తెలుగు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రాణిస్తోంది. 500k ఫాలోవర్స్ ఉన్న తన సొంత యూట్యూబ్ ఛానెల్ మేడం సర్ మేడం అంతే, రామ్ లీలా వంటి వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులరిటీ సంపాదించుకుంది సిరి.
ఆ గుర్తింపే బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్‌లోకి అవకావం వచ్చేలా చేసింది. అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్న సిరికి హౌస్‌లోకి వెళ్లే ముందే యూట్యూబ్ స్టార్ శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరికీ ఓ కొడుకు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వస్తున్న ఈ వార్తల్లో నిజం లేకపోలేదు.. ఈ జోడీ చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని దత్తత తీసుకున్నారు. బాలుడిని దత్తత తీసుకుని అతడికి మంచి భవిష్యత్ అందిస్తున్న సిరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com