నేచురల్ లుక్‌లో మోనల్.. బాలీవుడ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ బ్యూటీ మోనల్ గజ్జర్ అంతకు ముందు సినిమాల్లో నటించినా అంతగా ఎవరికీ తెలియని ఆమె హౌస్‌లోకి వచ్చాక తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయిన మోనల్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.
తాజాగా ఈ బ్యూటీ నటించిన కాగజ్ సినిమాలోని ఓ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'బైల్ గాడి' అంటూ సాగే ఈ పాటకు ప్రవేశ్ మల్లిక్ సంగీతం అందించగా, ఉదిత్ నారాయణ్ ఆలపించారు. కాగజ్ చిత్ర కథ విషయానికి వస్తే.. బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన లంచగొండి ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక సామాన్యుడు చేసే పోరాటమే ఈ సినిమా కథ.
అజంఘర్‌కు చెందిన భరత్ లాల్ బిహారీ అనే రైతు జీవిత కథ ఇది. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు 18 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. నాన్ గ్లామరస్ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన కాగజ్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోనాల్ గజ్జర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం జీ5 ఓటీటీలో విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com