బిగ్ బాస్ ప్రియా చిరంజీవి సినిమాలో..

బిగ్ బాస్ ప్రియా చిరంజీవి సినిమాలో..
బిగ్ బాస్ అంటే పలువురు సెలబ్రిటీలు ఒకరికి ఒకరు పెద్దగా పరిచయం లేకపోయినా కొన్నిరోజుల పాటు కలిసి ఉండాల్సిన ఇళ్లు.

బిగ్ బాస్ అంటే పలువురు సెలబ్రిటీలు ఒకరికి ఒకరు పెద్దగా పరిచయం లేకపోయినా కొన్నిరోజుల పాటు కలిసి ఉండాల్సిన ఇళ్లు. అయితే ఇందులోకి వచ్చేవారు అందరు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సెలబ్రిటీలే కాకపోవచ్చు. అప్‌కమింగ్ నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, ఒకప్పుడు సెలబ్రిటీ స్టేటస్‌ను అనుభవించి ప్రస్తుతం ఫేడవుట్ అయిపోయిన వారు కూడా ఇందులో చోటుదక్కించుకుంటారు. వారిలో ఒకరిగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యి దాదాపు మూడు వారాలైనా కూడా ప్రియా ఎక్కువగా ప్రేక్షకుల కంట్లో పడలేదు. కానీ ఈవారం నామినేషన్స్ అప్పుడు ఇతర హౌస్‌మేట్స్‌పై చేసిన కొన్ని అభియోగాల వల్ల ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. అసలు ప్రియా ఎవరు? తన సినీ కెరీర్ ఎలా ప్రారంభమయ్యింది? ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది ఇతర సీనియర్ ఆర్టిస్టుల లాగానే ప్రియా కూడా తన కెరీర్‌ను బుల్లితెర నుండే ప్రారంభించింది. గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టిన తన పూర్తి పేరు మామిళ్ళ శైలజా ప్రియ. ఒకప్పుడు జెమినిలో ప్రచురితమయిన శక్తి అనే సీరియల్‌‌తో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది ప్రియా. ఆ తర్వాత కూడా పలు సీరియళ్లతోనే తన కెరీర్ గడిచిపోయింది. అలా సీరియల్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సమయంలోనే దొంగాట అనే సినిమాతో మొదటిసారి వెండితెరపై కూడా మెరిసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో తాను చేసిన పాత్ర ప్రియా కెరీర్‌కు ప్లస్ అయ్యింది. వెంటవెంటనే సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. 25 వేల పారితోషికం అందుకోవడం దగ్గర నుండి 5 లక్షలు డిమాండ్ చేసేంత వరకు ప్రియా కెరీర్ ఎదిగింది. ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేక డల్ అయిన ప్రియాకు బిగ్ బాస్ ద్వారా ఆఫర్ల వర్షం కురుస్తుందేమో అనుకుంటున్నారు షో చూస్తూ తనకు ఫ్యాన్స్ అయిపోయినవారు.

Tags

Read MoreRead Less
Next Story