Bigg Boss Julie: ప్రేమ పేరుతో మోసపోయానంటున్న బిగ్ బాస్ బ్యూటీ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

Bigg Boss Julie (tv5news.in)
Bigg Boss Julie: సాధారణ మనిషి అయినా, సెలబ్రిటీ అయినా పెళ్లి పేరుతో మోసపోయే వారు చాలామందే ఉన్నారు. తాజాగా ఓ బుల్లితెర సెలబ్రిటీ కూడా ప్రేమ పేరుతో మోసాన్ని చవిచూసింది. ఆ యువకుడిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్‌లో కనిపించి ఫేమస్ అయిన ఈ సెలబ్రిటీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులో చాలాకాలం క్రితం జరిగిన జల్లికట్టు ఉద్యమం అప్పట్లో దైశవ్యాప్తంగా ప్రజలను తమవైపు తిప్పుకునేలా చేసింది. ఆ ఉద్యమంలో అందరిలాగే పాల్గొంటూ, బలమైన నినాదాలు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మాయి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానా. ఆ నినాదాలతో ఫైమస్ అయిన జూలీకి బిగ్ బాస్ తమిళం సీజన్ 1లో చోటు దక్కింది. అంతే.. తాను ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది.
బిగ్ బాస్‌లో జూలీకి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. కానీ బిగ్ బాస్ షోలో కనిపించడంతో తనకు చాలా గుర్తింపు లభించింది. బయటికి వచ్చిన తర్వాత పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. తాజాగా తాను ప్రేమించిన వాడు తనని మోసం చేశాడంటూ అన్నా నగర్ పోలీసులను ఆశ్రయించింది జూలీ.
అన్నా నగర్‌కు చెందిన మనీష్, జూలీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం జూలీకి మాయ మాటలు చెప్పి తన దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకుని మనీష్ పరారయ్యాడు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో జూలీ పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com