Bigg Boss 5 Telugu: హైదరాబాద్‌కు వచ్చేసరికి రెండు రూపాయలు మాత్రమే మిగిలాయి: పింకీ

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సమయం దొరికినప్పుడల్లా హౌస్‌మేట్స్ తమ జీవితంలో జరిగిన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. దానికి తగినట్టుగానే బిగ్ బాస్ కూడా వారికి టాస్క్‌లు ఇస్తూ ఉంటాడు. ఇటీవల జరిగిన స్మ్కైల్ చేయండి.. టాస్క్ చేయండి టాస్క్‌లో కూడా అలాగే తమ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను అందరితో పంచుకోమన్నాడు బిగ్ బాస్. ఆ టాస్క్‌లో భాగంగా ప్రియాంక పంచుకున్న విషయాలు చాలామంది ప్రేక్షకులను ఇన్‌స్పైర్ చేసేలా ఉన్నాయి.
'పెద్దయ్యేకొద్దీ ఊర్లో నామీద ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. నా ప్రవర్తనలో మార్పు వస్తోందని నాన్నతో చెప్పేవారు. అప్పుడు నేను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోవాలని ఫిక్సయ్యా! మా నాన్న జేబులో నుంచి 50 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. కానీ అక్కడ హైదరాబాద్‌కు టికెట్ 75 రూపాయలు అని తెలిసింది. అమ్మో, అంత డబ్బు నా దగ్గర లేదని మళ్లీ ఇంటికెళ్లాను. అక్కడ దేవుడికి ముడుపు కట్టిన డబ్బులను తీసుకుని హైదరాబాద్ వచ్చాను.'
'హైదరాబాద్‌కు వచ్చేసరికి నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే మిగిలాయి. ఒక రూపాయి కాయిన్‌తో మాదాపూర్‌లో ఉన్న చిన్నక్కకు ఫోన్ చేస్తే వాళ్లు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు అనుకోకుండా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది, చేశాను. ఆ తర్వాత అప్పారావు బాబాయి నువ్వు బాగున్నావు, లేడీ గెటప్ వేస్తావా? అని అడిగాడు. అలా ఒక కామెడీ షోలో కెరీర్ స్టార్ట్ చేశాను.' అని తన సక్సెస్ స్టోరీని చెప్పుకొచ్చింది పింకీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com