సినిమా

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి మరోసారి ఆ రీల్ కపుల్..

Bigg Boss OTT Telugu: తెలుగులో జరిగిన ప్రతీ ఒక్క బిగ్ బాస్ సీజన్‌లో ఓ ప్రేమకథ ఉంది.

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి మరోసారి ఆ రీల్ కపుల్..
X

Bigg Boss OTT Telugu:బిగ్ బాస్ తెలుగులో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ కూడా ప్రారంభం కానుంది. బిగ్ బాస్ ఓటీటీ కూడా ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వ్యక్తులనే బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. వీరు మాత్రమే కాకుండా బిగ్ బాస్ ఓటీటీలోకి ఓ రీల్ కపుల్ కూడా రానుందట.

బిగ్ బాస్‌లో ప్రేమకథలు సహజం. అవి హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత నిలబడకపోయినా.. హౌస్‌లో ఉన్నంత వరకు మాత్రం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అలా తెలుగులో జరిగిన ప్రతీ ఒక్క బిగ్ బాస్ సీజన్‌లో ఓ ప్రేమకథ ఉంది. అలా బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో జరిగిన ప్రేమకథే అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌ది. ఈ ఇద్దరు మరోసారి కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నట్టు టాక్.

అఖిల్, మోనాల్.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆ సీజన్ వరకు వీరిని లవ్ బర్డ్స్‌గా పరిగణించేశారు ప్రేక్షకులు. కానీ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత వీరు పెద్దగా లైమ్ లైట్‌లో కనిపించలేదు. బయటికి వచ్చిన కొత్తలో పలు ఛానెళ్లకు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా.. ఇప్పుడు ఎవరి లోకం వారిదే అన్న ఉద్దేశ్యంలో ఉన్నారు.

బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమవుతున్న సందర్భంగా కొంతమంది ముందు సీజన్ల కంటెస్టెంట్స్‌ను కూడా తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ ముందే నిర్ణయించింది. ఇందుకు పలువురు కంటెస్టెంట్స్‌ను కూడా వారు సంప్రదించారట. అందులో భాగంగానే అఖిల్‌ను, మోనాల్‌ను సంప్రదించగా వారు ఓకే చెప్పినట్టు సమాచారం. మరి ఈసారి ఈ లవ్ బర్డ్స్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తారో..

Next Story

RELATED STORIES