Bigg Boss: బిగ్‌బాస్ లొల్లి: క్యాట్ మమ్మీ అంటే డాగ్ డాడీ అంటుందా అంటూ..

Bigg Boss: బిగ్‌బాస్ లొల్లి: క్యాట్ మమ్మీ అంటే డాగ్ డాడీ అంటుందా అంటూ..
ఇంట్లోకి వెళ్లి ఒక్కరోజు కూడా అయిందో లేదో.. ఒకరి మీద ఒకరు తప్పులు ఎంచడం మొదలైంది..

Bigg Boss: ఇంట్లోకి వెళ్లి ఒక్కరోజు కూడా అయిందో లేదో.. ఒకరి మీద ఒకరు తప్పులు ఎంచడం మొదలైంది.. అనేవాళ్ల మీద నెగటివ్ అభిప్రాయం ఉంటే సరదాగా అన్నా సీరియస్‌గానే తీసుకుంటారు.. అదే పెద్ద తప్పుగా కనిపిస్తుంది.. వారిని ఎలిమినేట్ చేయడానికి అంతకంటే పెద్ద రీజన్ ఏముంటుంది. సోమవారం నాటి ఎపిసోడ్‌‌లో హమీద హైలెట్ అయింది.

ఇక లోబో గురక కంటెస్టెంట్లకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీంతో జెస్సీ, హమీద, శ్వేతా వర్మ ముగ్గురు గార్డెన్ ఏరియాలో కూర్చుని ముచ్చట్లు పెట్టారు. మాటల మధ్యలో హమీద తన పిల్లి మ్యావ్ అని కాకుండా అమ్మా అని పిలుస్తుందని చెప్పడంతో జెస్సీ షాకయ్యాడు.. హమీద కుక్కని పెంచుతున్నానన్ని చెప్పడంతో మరి అవి డాడీ అని పిలుస్తాయా అని జెస్సీ కౌంటర్ వేశాడు.

దాంతో మూతి ముడుచుకున్న హమీద చాలా ఫీలైంది జెస్సీ మాటలకి. ఆ మాటల్నే తీసుకుని జెస్సీని నామినేట్ చేసింది హమీద. మొత్తానికి ఇలా సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయడం ప్రేక్షకులకు వింతగా అనిపించింది. ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఒక్కళ్లు కూడా లేరనే విషయం సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమైపోతోంది.

మొత్తానికి మొదటి వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఇందులో యాంకర్ రవి, కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ నామినేట్ అయ్యారు. అయితే ఎక్కువగా జెస్సీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story