Bigg Boss : బిగ్ బాస్ కు కట్టుదిట్టమైన భద్రత

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు రావడంతో ఆయన కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది నడుమ ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ఫుల్‌స్టాప్ పడాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే, ఇలాంటి సమయంలో హిందీ బిగ్ బాస్ 18 సెట్‌లో ఆయన పాల్గొంటారా..? లేదా..? అనే సందేహాలు వచ్చాయి. ఇక ఈ సీజన్‌కు హోస్ట్‌గా సల్మాన్ వైదొలగనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇలాంటి వాటికి ఆయన ఫుల్‌స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 18 వీకెండ్ కోసం సల్మాన్ హజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది మధ్య ఆయన ఇప్పటికే సెట్‌లో ఎంట్రీ ఇచ్చారని సమాచారం. శుక్రవారమే 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌ను యూనిట్ పూర్తి చేయనుంది. సల్మాన్‌కు రక్షణగా సుమారు 50మందికి పైగానే సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, వారందరూ సల్మాన్ పర్యవేక్షణలో ఉండనున్నారు. ఎట్టిపరిస్థితిలో ఇతరులను హోస్‌లోకి అనుమతించరట. బిగ్ బాస్ యూనిట్ సభ్యులను కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వారిని సెట్స్‌లోకి అనుమతించనున్నారు. సల్మాన్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యాకే అక్కడున్న వారిని బయటకు పంపనున్నారు. సెట్‌లోని ఇతరుల వద్ద కనీసం ఫోన్ కూడా ఉంచకుండా జాగ్రత్తపడుతున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com