సినిమా

Bigg Boss Telugu Season 5: సింగర్ శ్రీరామ్‌కు కృష్ణంరాజు భార్య సర్‌ప్రైజ్ ..

Bigg Boss Telugu Season 5: వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలి కోరారు.

Bigg Boss Telugu Season 5: సింగర్ శ్రీరామ్‌కు కృష్ణంరాజు భార్య సర్‌ప్రైజ్ ..
X

Bigg Boss Telugu Season 5: రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 5 త్వరలో ముగియనుంది. టాప్ 5కి చేరుకున్న కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో పలువురు సెలబ్రెటీలు తమ అభిమాన కంటెస్టెంట్‌కు మద్ధతు తెలుపుతున్నారు.. సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లో సింగర్ శ్రీరామ్‌కు మద్ధతు ఎక్కువగా లభిస్తోంది.

ఇండియన్ ఐడల్‌గా దాదాపు దేశం మొత్తం తెలిసిన శ్రీరామ్‌కి సోనూసూద్, శంకర్ మహాదేవన్, ఎండీ సజ్జనార్, పాయల్ రాజ్‌పుత్ సహా పలువురు సెలబ్రెటీలు శ్రీరామ్‌కు సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా కృష్ణంరాజు భార్య, ప్రభాస్‌కు పెద్దమ్మ అయిన శ్యామలా దేవి తన మద్ధతు ప్రకటించారు. వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలి కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాయ్ శ్రీరామ్.. బిగ్‌బాస్ షో చూస్తున్నాం.. నువ్వు బాగా ఆడుతున్నావు. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరికీ గర్వకారణం అయ్యావు. బిగ్‌బాస్లో కూడా గెలవాలని మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆలి ది బెస్ట్ అని చెప్పారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శ్రీరామ్‌కు కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభించడంతో శ్రీరామ్ ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES