Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో ఓ రియల్ లైఫ్ కపుల్..

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ అనే రియాలిటీ షో.. దేశవ్యాప్తంగా ఎన్నో విధాలుగా గుర్తింపు తెచ్చుకుంది. ముందుగా హిందీలో ప్రారంభమయిన ఈ రియాలిటీ షో.. ఇంకా పలు రకాలుగా బిగ్ బాస్‌ను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. అందులో ఒకటి బిగ్ బాస్ ఓటీటీ. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అవ్వడానికి రంగం సిద్ధమయ్యింది.
తెలుగు బిగ్ బాస్ ఓటీటీ కోసం కంటెస్టెంట్స్ లిస్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే దాదాపు అందరి పేర్లు ఖరారు అయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో 15 మంది కంటెస్టెంట్స్ ఉండనున్నారట. ఫిబ్రవరీ 20న గ్రాండ్‌గా తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 ప్రారంభం కానుందని సమాచారం. తాజాగా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
బిగ్ బాస్ ముందు సీజన్లలో కూడా రియల్ లైఫ్ కపుల్స్ ఎంట్రీ ఇచ్చి ఎంటర్‌టైన్ చేశారు. వరుణ్ సందేశ్, వితికా షేరు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అలాగే ఎంట్రీ ఇచ్చి వారి ఆటతో అందరినీ అలరించారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో కూడా డ్యాన్సర్ రఘుతో పాటు తన భార్య ప్రణవితో కలిసి రానున్నాడని టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com