10 Feb 2022 12:16 PM GMT

Home
 / 
సినిమా / Bigg Boss Telugu OTT:...

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ నుండి ఆసక్తికర విషయాలు బయటికి.. ఈసారి ఏకంగా..

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ అంటే టీవీలో వచ్చే బిగ్ బాస్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది.

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ నుండి ఆసక్తికర విషయాలు బయటికి.. ఈసారి ఏకంగా..
X

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ రియాలిటీ షోకు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం వారి భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షోను ఫాలో అయ్యేవారి సంఖ్య చాలానే ఉంటుంది. అలాంటి వారి కోసమే ముందుగా హిందీ బిగ్ బాస్ టీమ్ ఓ కొత్త ప్రయోగంతో అందరి ముందుకు వచ్చింది. అదే బిగ్ బాస్ ఓటీటీ. ఈ ఐడియా సూపర్ సక్సెస్ అవ్వడంతో తెలుగులో కూడా ఈ ఫార్ములాను ఫాలో అవ్వనున్నారు.

ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఇందులో కంటెస్టెంట్స్ ఫైనల్ అయిపోయారని, అంతే కాకుండా ముందు సీజన్లలో కనిపించిన కొందరు కంటెస్టెంట్స్ కూడా మళ్లీ బిగ్ బాస్ ఓటీటీలో భాగమవ్వనున్నారని సమాచారం. అంతే కాకుండా తాజాగా బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ లోగో కూడా విడుదలయ్యింది.

బిగ్ బాస్ ఓటీటీ అంటే టీవీలో వచ్చే బిగ్ బాస్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. టీవీలో వచ్చే బిగ్ బాస్ కేవలం గంట మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. కానీ బిగ్ బాస్ ఓటీటీ అలా కాదు. 24 గంటలు హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో ప్రేక్షకులకు చూపిస్తుంది. ఇది కేవలం ఓటీటీలోనే ప్రచారం అవుతుంది. పైగా ఈ విరామం లేని టెలికాస్ట్ నుండి ఒక గంటను ఎపిసోడ్‌లాగా కూడా కట్ చేసి ఓటీటీ ప్రేక్షకులకు అందిస్తుంది టీమ్.

బిగ్ బాస్ 3వ సీజన్ నుండి నాగార్జున దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ మూడు సీజన్లు ఆయన హోస్టింగ్‌తోనే ముందుకు వెళ్లాయి. అయితే బిగ్ బాస్ ఓటీటీకి మాత్రం నాగార్జున హోస్ట్ కాదంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. కానీ అవేవి నిజం కాదని తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జుననే హోస్ట్. బిగ్ బాస్ ఓటీటీ కూడా 15 వారాలు హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫిబ్రవరి 26న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్ ప్రారంభం కానుంది.

Next Story