Siri Hanmanth: సిరికి బిగ్‌బాస్ ఇచ్చింది ఎంతో తెలుసా..!!

Sir Hanmanth: ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ, పటాకా ఆఫ్ ద బిగ్‌బాస్ హౌస్ అని పేరుతెచ్చుకున్న సిరి లాస్ట్ ఐదుగురు కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి మిగిలిన నలుగురికి గట్టి పోటీనే ఇచ్చింది. సైలెంట్‌గా ఉండే షణ్నూకి, సిరికి మధ్య ఫ్రెండ్‌షిప్ బాండ్ బయటకు వచ్చాక ఎలా ఉంటుందో కానీ హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రం ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉన్నారు.
గొడవైనా ప్రేమైనా తగ్గేదేలేదన్నుట్లుగా ఆడింది సిరి హౌస్‌లో ఉన్నన్ని రోజులు. సన్నీ మీద ఫైర్ అయిన సిరి షణ్నూకి మాత్రం ప్రేమను పంచింది. గ్రాండ్ ఫినాలే వరకు వెళ్లి ఎలిమినేట్ అయిన సిరికి బిగ్‌బాస్ బాగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌తో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరికి వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఇస్తామని బిగ్‌బాస్ ముందుగానే డీల్ కుదుర్చుకున్నారని సోషల్ మీడియా కథనాలు. అదే నిజమైతే పదేహేను వారాలకుగాను సిరికి దాదాపు పాతిక లక్షలు వచ్చుంటాయి.
ట్రోఫీ గెలవకపోయినా పారితోసికం బాగానే ముట్టింది అమ్మడికి. కాగా బిగ్‌బాస్ సీజన్ 6కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com