బిగ్‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్.. ఈసారి మరింత వినోద భరితంగా..

బిగ్‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్.. ఈసారి మరింత వినోద భరితంగా..
టెలివిజన్‌‌ షోలో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

టెలివిజన్‌‌ షోలో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ రియాలిటీ షోకు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అభిమానులు ఉన్నారు. తెలుగులో అయితే, బిగ్ బాస్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే టిఆర్‌పి రేటింగ్‌లో ఈ షో రికార్డులు బద్దలు కొడుతోంది.

గత నాలుగు సీజన్ల విజయంతో, షో యాజమాన్యం ఐదవ సీజన్ పై దృష్టి పెట్టారు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐదవ సీజన్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా, సెట్ ఇప్పటికే నిర్మాణంలో ఉంది. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరుకుంది.

కాగా, ఈ సీజన్లో పోటీదారుల జాబితా కాస్త భిన్నంగా ఉండేటట్లు చూసుకుంటోంది యాజమాన్యం. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిన పేర్లు..

యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, టీవీ నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, నటి ఇషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, జంట శ్రీహాన్, సిరి హనుమంత్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story