బోర్‌డమ్‌కు చెప్పండి గుడ్‌బై.. బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది

Bigg Boss Telugu Season 5: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. బిబ్ బాస్ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి 'బిగ్‌బాస్' టీం సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవలే బిగ్‌బాస్-5 లోగోని విడుదల చేసింది స్టార్ మా చానల్. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే వ్యవహరించనున్నాడు. మరో ప్రోమో విడుదల చేశారు. తెలుగులోకి బిగ్ బాస్ షో మొదలైన సమయంలో దీన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ, ఊహించని విధంగా ఈ షోను సూపర్ హిట్ చేశారు. బిగ్ బాస్(bigg boss) నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే బిగ్‌బాస్‌లో కనిపించే కంటెస్టెంట్లకు వచ్చే ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఇక త్వరలోనే 5వ సీజన్ కూడా మొదలవబోతుంది.
ఈ ప్రోమో విషయానికి వస్తే.. నాగార్జున మాస్ ఎంట్రీతో తీర్చిదిద్దిన ఈ ప్రోమోను శనివారం విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా దీన్ని తీర్చిదిద్దింది. అంతేకాదు, ఈసారి హోస్ట్ ఎవరన్న దానిపై వస్తున్న వార్తలకు సమాధాన ఇస్తూ నాగ్ ఎంట్రీ అదిరింది. 'చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్ సీజన్-5' అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com