Bigg Boss Telugu Season 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 డేట్ వచ్చేసింది..?

Bigg Boss Telugu Season 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 డేట్ వచ్చేసింది..?
Bigg Boss Telugu Season 6 : రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు మేకర్స్​.

Bigg Boss Telugu Season 6 : రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు మేకర్స్​. బుల్లితెర తెలుగు ప్రేక్షకులను వీపరితంగా అలరించిన బిగ్‌బాస్‌ త్వరలోనే సీజన్‌6 ప్రేక్షకుల ముందుకు రానుంది. గత మూడు సీజన్ల కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు.

ప్రస్తుతం ఈ కొత్త సీజన్​లో పాల్గొనే కంటెస్టెంట్‌ల ఎంపిక పూర్తయింది. అంతేకాదు, వారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నిర్వహించే గ్రాండ్‌ ఎంట్రీ ఈవెంట్‌ను కూడా దాదాపు పూర్తి చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. సెప్టెంబరు 4వ తేదీ నుంచి బిగ్‌బాస్‌ సీజన్‌-6' టెలికాస్ట్‌ కానుంది. ఈ సీజన్‌లో ఎంతమంది హౌస్‌లోకి వెళ్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story