Home
 / 
సినిమా / Bigg Boss Telugu...

Bigg Boss Telugu Season 5: హౌస్‌లోకి రావాలంటే లంచం.. అంతలేదు.. : జెస్సీ క్లారిటీ

Bigg Boss Telugu Season 5: ఈ సీజన్‌‌లో మోడల్‌గా పని చేస్తున్న జెశ్వంత్ షోలో ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss Telugu Season 5: హౌస్‌లోకి రావాలంటే లంచం.. అంతలేదు.. : జెస్సీ క్లారిటీ
X

Bigg Boss Telugu Season 5: రియాల్టీ షో బిగ్‌బాస్ ఏ భాషలో వచ్చినా వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. షోలోని కంటెస్టెంట్లు ఎక్కువగా నటీనటులు, సింగర్లు, కొరియోగ్రాఫర్‌లు, యూట్యూబర్‌లే కనిపిస్తారు. మోడల్స్ పాల్గొనడం అనేది చాలా తక్కువ. అయితే ఈ సీజన్‌‌లో మోడల్‌గా పని చేస్తున్న జెశ్వంత్ షోలో ఎంట్రీ ఇచ్చాడు.

బిగ్‌బాస్ నుంచి అతడికి ఆఫర్ వచ్చిందా లేదా అతడే హౌస్‌లోకి వచ్చేందుకు ఎదురు డబ్బులు ఇచ్చాడా అనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగానే షోకి రావాలంటే డబ్బులు ముట్టజెప్పాలా అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. తాజాగా తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ జెస్సీ క్లారిటీ ఇచ్చాడు.

ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చాను.. అకౌంట్‌లో రూ.11 వేలు మాత్రమే ఉన్నాయి.. నేను బిగ్‌బాస్‌కి డబ్బులు ఇవ్వడం ఏమిటి.. పోనీ మీకంటే తెలియదు.. హౌస్‌లో ఉన్నవాళ్లు కూడా అదే మాట అంటున్నారు. ఇలా మాట్లాడడం నన్ను బాధించింది. నాకు తండ్రి లేడు.

రాత్రిళ్లు ఉద్యోగం చేసి ఆ డబ్బుతో మోడలింగ్ నేర్చుకుంటూ ఎదిగాను. డబ్బు విలువ తెలుసు. బిగ్‌బాస్ ఆఫర్ ఫ్రీగా వచ్చినా వెళ్లాలనుకున్నాను. కానీ వాళ్లే నాకు డబ్బులు ఇచ్చారు. అంతేకాని ఎదురు డబ్బులిచ్చేంత స్థోమత నాకు లేదు అని జెస్సీ క్లారిటీ ఇచ్చాడు. తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు.

Next Story