Bigg Boss Season 5 Telugu: వీరిలో బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేదెవరు?

Bigg Boss Season 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఫన్నీ టాస్క్‌లతో సంతోషంగా కలిసుంటున్న హౌస్‌మేట్స్ అప్పుడప్పుడు చిర్రుబుర్రులాడుకుంటూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లో గ్రూపులు క్రియేట్ అయిపోయాయి. గ్రూపులుగా ఆడితేనే సపోర్ట్ లభిస్తుందని చాలామంది హౌస్‌మేట్స్ భావిస్తున్నారు.
అయితే ప్రతీ సీజన్‌లో లాగా కాకుండా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎక్కువమంది హౌస్‌మేట్స్ ఒకేసారి ఎంటర్ అయ్యారు. మామూలుగా కొన్ని రోజులు గడిచిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో కొత్త హౌస్‌మేట్స్‌ను తీసుకొస్తాడు బిగ్ బాస్. అయితే ఈసారి అలాంటి ఎంట్రీ ఏమీ ఉండదు కాబట్టే ఒకేసారి అందరిని హౌస్‌లోకి పంపించారని టాక్ వినిపిస్తుంది. అయినా అప్పుడప్పుడు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి చర్చ నడుస్తూనే ఉంది. లిస్ట్‌లో ఇద్దరు బుల్లితెర యాంకర్స్ ఉండడం విశేషం.
వర్షినీ సౌందరాజన్.. సినిమాల్లో నటిగా పరిచయమయ్యి ప్రస్తుతం బుల్లితెరపై వాంటెడ్ యాంకర్‌గా సెటిల్ అయిపోయిన ముద్దుగుమ్మ. అయితే ఈమె గత కొంతకాలంగా స్క్రీన్‌పైన కనిపించకపోవడంతో తను బిగ్ బాస్ వెళ్లడానికే ప్రిపేర్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. తనతో పాటు బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానుందని వార్తలు వస్తున్న యాంకర్ విష్ణు ప్రియా.
యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కొన్నిరోజుల్లోనే సరిపడా క్రేజ్ సంపాదించుకున్న విష్ణు ప్రియా ప్రస్తుతం కాస్త డల్ అయ్యింది. అయితే బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తుందన్న వార్తలు నిజమయితే తన కెరీర్ టర్న్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి వీరిద్దరిలో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్తారు? ఎవరు ఎక్కువ సపోర్ట్‌ను గెలుచుకుంటారు? చూడాల్సిందే..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com