బిగ్‌బాస్ డేట్ కన్ఫామ్.. ఆ రోజు నుంచే..
సందడి మొదలైంది.. సీజన్ 5లో కంటెస్టెట్లు ఎవరెవరు అనేది కూడా మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. ఈ సీజన్ సెప్టెంబర్‌లో ప్రసారం కాబోతోంది. హౌస్‌లోకి వచ్చే సెలబ్రెటీస్ ఎవరెవరు అనేది అందరిలో ఆసక్తి నెలకొంటోంది.
ఒకే ఇంట్లో అంత మంది 100 రోజులు కలిసి ఉండడం అంటే పెద్ద టాస్క్. గేమ్ ఆడుతూ, వంట చేసుకుని తింటూ, పన్లన్నీ వాళ్లే చేసుకుంటూ, చాడీలు చెప్పుకోకుండా, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమంటే మాటలు కాదు. అందుకే హౌస్‌లో వాళ్లు చేసే అల్లరి ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచుతుంది.
ఇక హౌస్‌లో సాగే ప్రేమాయణాలు, రొమాంటిక్ సీన్లకు కొదవే వుండదు. సినిమాని తలపించే సీన్లు ఇందులోనూ తక్కువ కాదు. మొత్తానికి సెప్టెంబర్ 5 నుంచి సీజన్ మొదలు కాబోతోంది. ఈ సీజన్‌కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Time to end the boredom. #BiggBossTelugu5 starting September 5th at 6 PM on #StarMaa pic.twitter.com/lcEtuEGGBq
— starmaa (@StarMaa) August 26, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com