సినిమా

BiggBoss: వామ్మో ఇదేం ఆట.. బిగ్‌బాస్ హౌస్‌లో 'ఉమాదేవి' ఉగ్రరూపస్య

ఇంట్లో ఇద్దరు ఉంటేనే భిన్న అభిప్రాయాలతో ఉంటారు.. అదే బిగ్‌బాస్ హౌస్‌లో అయితే బయట వాళ్ల ఊసు ఉండదు.. అందులో ఉన్న వాళ్లే..

BiggBoss: వామ్మో ఇదేం ఆట.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉమాదేవి ఉగ్రరూపస్య
X

ఇంట్లో ఇద్దరు ఉంటేనే భిన్న అభిప్రాయాలతో ఉంటారు.. సర్దుకుపోతూ సంసారాన్ని ఈడ్చుకొస్తుంటారు. అదే బిగ్‌బాస్ హౌస్‌లో అయితే బయట వాళ్ల ఊసు ఉండదు.. అందులో ఉన్న వాళ్లే కొట్టుకున్నా, తిట్టుకున్నా, ప్రేమ ఒలకబోసినా.. ఒకటి రెండు రోజుల్లోనే ఎవరేంటో అర్థమైపోతుంది.. ఇక్కడ ఆడుతున్నది ఆట అన్న విషయం మరిచిపోయి పర్సనల్‌గా తీసుకుని ప్రవర్తిస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణ నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా 'పంతం నీదా నాదా'లో సన్నీ అనుకోకుండా పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది.

అది చూసిన సింగర్ శ్రీరామ్.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు. దీంతో సన్నీకి శ్రీరామ్‌ మీద కోపం నషాళానికి అంటింది.. మగాడివైతే ఆడుదువురా అని అతడిని రెచ్చగొట్టింది మరో కంటెస్టెంట్ ప్రియ. పర్సుల్ టీమ్ మీద పడి పిల్లోస్ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది. ఆమెతో పెట్టుకుంటే ఎవరైనా అంతే సంగతులు. అపోజిట్ టీమ్ సభ్యులను ఉతికి ఆరేయాలని చూసింది. తనను కొడితే డ్రెస్ చింపుతానని ఉమ అనడంతో కూల్‌గా ఉండే యానీ మాస్టర్ కూడా ఆవేశంతో రగిలిపోయింది. నోటికి పనిచెప్పింది.. ఒసేయ్ ఉమా సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది.

మరోపక్క పర్పుల్ టీమ్ దగ్గరకు వచ్చిన శ్వేతను తన్నేందుకు ప్రయత్నించింది ప్రియ. జుట్టు పీక్కుంటూ, ఒకరి మీద ఒకరు పడి ఆట ఆడుతున్నారో, కొట్టుకుంటున్నారో తెలియకుండా అరుపులు, కేకలతో రెచ్చిపోతున్నా, రక్తం వచ్చేలా కొట్టుకు ఛస్తున్నా.. బిగ్‌బాస్ మాత్రం అంతా అయిపోయాక హౌస్‌లో హింసకు తావులేదు అని హెచ్చరిక చేయడం గమనార్హం. చూసే ప్రేక్షకులు మాత్రం.. వీళ్లు కొట్టుకోవడానికే వచ్చారా లేక కొట్టుకునే వాళ్లనే బిగ్‌బాస్ తీసుకువచ్చాడా అనేది అందరికీ డౌట్ వస్తోంది.

Next Story

RELATED STORIES