Bigg Boss Telugu 6: అప్పగింతలయ్యే వరకు ఆగలేకపోయారు.. అంటే ఆట మొదలైనట్టే..

Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ వస్తుందంటే బోల్డంత హంగామా.. బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరించిన కార్యక్రమాల్లో బిగ్‌బాస్ ఒకటి. 6వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రోమోని రిలీజ్ చేశారు నటుడు నాగార్జున. పెళ్లి అప్పగింతల సమయ్ంలో నవ వదువు కంటతడి పెట్టుకోవడం, షో టైమైందని తల్లిదండ్రులు అదృశ్యమవడం, అప్పుడు నాగార్జున ఎంట్రీ ఇవ్వడం ప్రధానంగా కనిపిస్తుంది.
పెళ్లి కూతురు తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న సమయంలో నాగార్జున వచ్చి అప్పగింతల వరకూ కూడా ఆగలేకపోయారంటే ఆట మొదలైనట్టే అని బిగ్‌బాస్‌ని ఉద్దేశించి అంటారు.. ఆసక్తికరమైన సన్నివేశాలతో షో ఆద్యంతం ఆకట్టుకుంది. లైఫ్‌లో ఏదైనా బిగ్‌బాస్ తర్వాతే.. బిగ్‌బాస్ సీజన్ 6.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ నాగార్జున తనదైన శైలిలో చెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం ఓటీటీ 'డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
సీజన్ 3,4,5 కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున 6వ సీజన్‌కు కూడా ఆయనే అని తెలుస్తోంది. ఇక ఇందులో పాల్గొనే టీమ్ సభ్యులు ఎవరెవరు అనేది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com