Allu Arjun : అల్లు అర్జున్ ఆ వెయ్యి సాధిస్తే చరిత్రే

Allu Arjun :  అల్లు అర్జున్ ఆ వెయ్యి సాధిస్తే చరిత్రే
X

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీస్ లోనూ, సోషల్ మీడియాలోనూ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గురించిన టాపిక్స్ ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లే. ఇప్పటి వరకూ రాజమౌళి లేకుండా ఏ తెలుగు హీరో కూడా ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చూడలేదు. అందుకే ఐకన్ స్టార్ హైలెట్ అవుతున్నాడు. అదే టైమ్ లో అతనికి అంత సత్తా ఉందా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. అతనికి ఏ పాత్రైనా చేసే సత్తా ఉందని అందరికీ తెలుసు. అదే దమ్ము పుష్ప 2 కంటెంట్ లో కూడా ఉంటే వెయ్యి కోట్లు పెద్ద మేటరేం కాదు. పైగా అతనికి ఇతర భాషల్లో మిగతా వారికి లేనంత మార్కెట్ ఉంది. పుష్ప 2కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే చాలు.. 1000 కోట్లు కొల్లగొట్టేస్తాడు. అదే జరిగితే అతను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించినట్టే.. ఇదీ హిస్టరీ క్రియేట్ చేస్తుంది. అయితే అసలు పుష్ప 2 వెయ్యి కోట్లు ఎక్కడెలా వచ్చిందో చూస్తే..

నాన్ థియేట్రికల్ బిజినెస్ లో

ఓటిటి అన్ని భాషలకూ కలిపి - 275 కోట్లు (ఇది ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ కావడం విశేషం)

మ్యూజికల్ రైట్స్ - 65 కోట్లు

శాటిలైట్ ( అన్ని భాషలకూ కలిపి) - 85 కోట్లు

టోటల్ - 425 కోట్లు..

థియేట్రికల్ రైట్స్ చూసుకుంటే

తెలుగు రాష్ట్రాలకు కలిపి - 220 కోట్లు (దాదాపు)

కేరళ - 20 కోట్లు

కర్ణాటక - 30 కోట్లు

తమిళనాడు - 50 కోట్లు

నార్త్ మొత్తం - 200 కోట్లు

టోటల్ - 500 కోట్లు

సో.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ తో పాటు ఓవర్శీస్ కూడా కలుపుకుంటే 1000 కోట్లు. అయితే ఇందులో కొన్ని హెచ్చు తగ్గులు కూడా ఉండొచ్చు. అయినా రాండమ్ గా వెయ్యి కోట్ల టార్గెట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఒక వేళ లాస్ అయితే థియేట్రికల్ గానే ఉంటుంది. నాన్ థియేట్రికల్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఇంక నిర్మాతలకు లాస్ అనే మాటే లేదు. థియేటర్స్ లో డిజాస్టర్ అయితేనే డిస్ట్రిబ్యూటర్స్ కు సెటిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఈ మూవీకి ఉన్న ఊపు చూస్తుంటే ఖచ్చితంగా హిట్ కొట్టేలానే ఉంది. అలాగే ఈ మొత్తం రాబట్టడం అంత సులవైతే కాదు. కానీ కంటెంట్ బలంగా ఉంటే సాధ్యం అవుతుంది. సింపుల్ గా చెబితే థియేట్రికల్ పుష్ప 2 దాదాపు 700 కోట్ల వసూళ్లు సాధించాలి. అప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుంది. కొన్నవాళ్లు సేఫ్ అవుతారు. అయితే ఇందులో తమిళనాడు మార్కెట్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్లు ఈ తరహా మూవీని కెప్టెన్ ప్రభాకర్ రూపంలో 90ల్లోనే చూశారు. సో.. అదే పెద్ద బెట్ లా ఉంది. ఇక మిగతా అంతా ఖచ్చితంగా హోప్స్ పెట్టేసుకోవచ్చు. ఏదేమైనా అల్లు అర్జున్ పై ఒక వర్గం కోపంగా ఉన్నా.. ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతమైన బిజినెస్ అయింది. అది చాలు.. ఈ మూవీ గురించి డిస్ట్రిబ్యూటర్స్ ఏ రేంజ్ అంచనాలున్నాయో తెలియడానికి.

Tags

Next Story